శరవేగంగా సాగుతున్న భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు! దేశంలోనే అతి పొడవైన రన్ వే.!

  Tue Apr 08, 2025 16:23        Politics

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోంది. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కేవలం 26 శాతంలో ఉండిన నిర్మాణ పనులు ప్రస్తుత ప్రభుత్వం దృష్టి సారించడంతో 71 శాతం వరకు పూర్తయ్యాయి. ముఖ్యంగా ఎర్త్ వర్క్, రన్‌వే పనులు 97 శాతం పూర్తయ్యాయి. ట్యాక్సీ వే పనులు కూడా 92 శాతానికి చేరగా, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం 60 శాతం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) టవర్ 42 శాతం, యాన్సిలరీ బిల్డింగ్ పనులు 40 శాతం పూర్తయ్యాయి. ఈ వేగంతో నిర్మాణం కొనసాగుతుండటంతో భోగాపురం ఎయిర్ పోర్టు పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

 

ఈ ప్రాజెక్ట్‌తో దేశం రూపురేఖలు మారనున్నాయని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యాధునిక సదుపాయాలతో ఈ ఎయిర్ పోర్ట్‌ను నిర్మిస్తున్నారు. 3.8 కిలోమీటర్ల పొడవు కలిగిన రన్‌వేతో ఇది దేశంలోనే అతి పెద్దదిగా నిలవనుంది. భోగాపురం ఎయిర్ పోర్ట్‌ను దేశంలోని అత్యాధునిక ఎయిర్ పోర్ట్‌లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఎయిర్ పోర్ట్ అభివృద్ధి విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీటీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #BhogapuramAirport #BhogapuramInternationalAirport #AirportDevelopment #InfrastructureGrowth #AndhraDevelopment